అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత పక్కింట్లో పిడుగు పడినా తమకు పట్టనట్టుంటున్నారు. ఇరుగు పొరుగు అనే కాన్సెప్ట్ పూర్తిగా కనుమరుగైంది. నగరాల్లో ఇలా ఉంటే గ్రామాల్లో శుభవార్త అయినా, దుర్వార్త అయినా కలిసి పంచుకుంటున్నారు. రష్యాలో ఓ సర్కస్ లో రెండు ఏనుగుల్లో ఒకటి చనిపోయింది. మరోటి తట్టుకోలేకపోయింది. కంటితడి పెట్టింది. అంతేకాదు చనిపోయిన ఏనుగు దగ్గరికి ఎవరినీ రానీయకుండా కాపాలా కాసింది. ఇది చూసిన సర్కస్ కంపెనీ సిబ్బంది కన్నీటిపర్యంతమయ్యారు. సర్కస్ కంపెనీలో ఓ ప్రేక్షకుడే వీడియో తీసి సోషల్ మీ డియాలో పో స్ట్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. పాతికేళ్ల పాటు ఈ జోడి ఏనుగులు సర్కస్ కంపెనీలో చేసిన వినోదం అంతా ఇంతాకాదు. తన పార్ట్ నర్ చనిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఏనుగు గంటలకొద్దీ అక్కడే గడిపింది. జెన్నా, మాగ్దా పేర్లు గల ఏనుగుల్లో ఒకటి చనిపోవడంతో మరోటి తట్టుకోలేకపోయింది. మనుషుల్లో బంధాలు బంధవ్యాలు తగ్గిపోతున్న తరుణంలో ఈ ఏనుగుల బంధం గొప్ప సందేశాన్ని సభ్య సమాజానికి అందించాయి.